నేడు కొనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి కేసీఆర్‌..

నవతెలంగాణ- హైదరాబాద్: కేసీఆర్‌ సిద్దిపేట జిల్లాకు పయనం కానున్నారు. నేడు సిద్ధిపేట జిల్లా కొనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు.  ఈ సందర్భంగా నామినేషన్ పత్రాలు స్వామి వారి ముందు ఉంచి ప్రత్యేక పూజలు చేయనున్నారు సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు. అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేస్తారు. ఇక ఈ నెల 9న గజ్వేల్, కామారెడ్డి లలో నామినేషన్ వేయనున్నారు. 38 ఏళ్లుగా కొనాయిపల్లి వెంకన్న ఆలయంలో పూజలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Spread the love