కేసీఆర్‌కు గాయం..అర్ధరాత్రి ఆస్పత్రికి తరలింపు

నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆస్పత్రిలో చేరారు. కాలుజారి పడటంతో కేసీఆర్‌కు గాయమైనట్లు సమాచారం. దీంతో గురువారం అర్ధరాత్రి యశోద ఆస్పత్రిలో ఆయన్ను చేర్చారు. కేసీఆర్‌ కాలి ఎముక విరిగినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌కు చికిత్స అందిస్తున్నారు.

Spread the love