నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్ కమిషన్ ఏర్పాటును రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం కొట్టేసింది. విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈక్రమంలో ఆయన తరఫు న్యాయవాదులతో హైకోర్టు విభేదించింది. విద్యుత్ కమిషన్ విచారణను కొనసాగించొచ్చంటూ ధర్మాసనం పేర్కొంది.