నవతెలంగాణ-హైదరాబాద్ : పోలీసులకు బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాస్ వార్నింగ్ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇవాళే నేను నూరు నూటయాబై లారీలు దాటుకుంట వచ్చిన. అందులో ఫుల్‌గా మంది ఉన్నరు. చాలాదూరంలో పోలీసుళ్లో ఆపుతున్నరు. పోలీసోళ్లు బొమ్మలు పీకేస్తున్నరు. పోలీసుల మిత్రులకు మనవి చేస్తున్నా.. మీ డ్యూటీ మీరు చేయండి. పదేళ్లు మేం గవర్నమెంట్‌లో ఉన్నం. అమాయకులను బెదిరించడం, కొట్టడం.. బీఆర్‌ఎస్ ఫ్లెక్సీలు పీకేయడం ఇదా మీ డ్యూటీ? ఇవాళ మేం కూడా లెక్కబెడుతున్నాం. నేను పోలీస్ పేరెత్తంగనే ప్రజలు ఎలా స్పందిస్తున్నరో మీరు చూస్తున్నరు. ఇప్పటికైనా మీ అరాచకాలు బంద్ చేయండి. జాగ్రత్త మళ్లీ గ్యారంటీగా బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుంది. మీ గతి ఏమవుతుందో ఆలోచన చేసుకోవాలి. పదేళ్లు నేను ముఖ్యమంత్రిగనే ఉన్ననే. ఒక్కరోజన్నా దౌర్జన్యం చేసినమా? ఎవరినైనా వేధించామా? మరి వాళ ఎందుకు పోలీసులు మితిమీరిన పనులు చేస్తున్నరు. పోలీసులు దయచేసి మానుకోండి’ అని హితవు పలికారు.