కేసీఆర్‌ మెదక్‌ పర్యటన 23వ తేదీకి వాయిదా

నవతెలంగాణ – హైదరాబాద్: ముఖ్యమంత్రి మెదక్‌ జిల్లా షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నది. షెడ్యూల్‌ ప్రకారం 019న మెదక్‌ జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అదే రోజున భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. నేపథ్యంలో పర్యటనలో 23వ తేదీకి వాయిదా వేసినట్లు మెదక్‌ కలెక్టర్‌ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటనలో సీఎం కేసీఆర్‌ కొత్తగా నిర్మించి సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయం, జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాయాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. దాంతో బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాన్ని సైతం ప్రారంభించనున్నారు.

Spread the love