– పాలకుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ పెద్దవంగర: ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ ను గెలిపిస్తాయని పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం మండలంలోని కొరిపల్లి, వడ్డెకొత్తపల్లి, పోచారం, గంట్లకుంట, పోచంపల్లి, అవుతాపురం, ఉప్పరగూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. అంతకు ముందు ఆయా గ్రామాల్లో ప్రచారానికి వచ్చిన మంత్రి ఎర్రబెల్లికి ప్రజలు డప్పు చప్పుళ్ళు, కోలాటాలు, బతుకమ్మ లతో ఘనంగా స్వాగతం పలికారు. ప్రచారంలో ప్రముఖ గాయకులు గిద్దె రామనర్సయ్య, గంగమ్మ, కనుకవ్వ ఆడి,పాడి అలరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి, తెలంగాణ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్ రావు, ఎన్ఆర్ఐ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి లతో కలిసి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే కాకుండా ప్రజలకు అవసరమయ్యే పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్న ఘనత కేసీఆర్ దే అని అన్నారు. కొన్ని పార్టీల వారు ఎన్నికలప్పుడే వస్తారని విమర్శించారు. కాంగ్రెస్ అమలుకు నోచుకోని హామీలు ఇస్తూ, ఓట్ల కోసం వస్తున్నారని అలాంటి వారిని నమ్మవద్దని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల కోసం సౌభాగ్య లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఎలాంటి పింఛను లేని మహిళలకు నెలకు రూపాయలు 3000 అందించడం జరుగుతుందని తెలిపారు. అలాగే రైతులకు పెట్టుబడి సహాయం సంవత్సరానికి ఎకరానికి రూపాయలు 16,000 ఇస్తామని తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధికి పట్టం కట్టాలంటే కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, గోపాల్ రావు, సోమేశ్వర్ రావు, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్, సీనియర్ నాయకులు ముత్తినేని శ్రీనివాస్, శ్రీరాం సుధీర్, పాలకుర్తి యాదగిరిరావు, వేణుగోపాల్ రావు, సర్పంచ్ లు గాజుల శోభ ప్రసాద్ రావు, నూనావత్ లక్ష్మీ బాలు, చింతల భాస్కర్ రావు, సుధగాని యాదలక్ష్మి మనోహర్, సలిదండి మంజుల సుధాకర్, దుంపల జమున సమ్మయ్య, విశ్వనాథుల జ్ఞానేశ్వర చారి, బొమ్మెరబోయిన రాజు, తంగళ్ళపల్లి మల్లికార్జున చారి, యూత్ అధ్యక్షుడు హరీష్, మొర్రిగాడుదుల శ్రీనివాస్, కూకట్ల యాకన్న, వెంకట్ రెడ్డి, అనుదీప్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.