కేడీసీసీ నూతన బ్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన..

నవతెలంగాణ-బెజ్జంకి 
మండల కేంద్రంలో పీఏసీఎస్ నూతన బ్యాంక్ నిర్మాణానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పీఏసీఎస్ పాలక వర్గం సభ్యులు, స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఎమ్మెల్యేకూ పీఏసీఎస్ పాలక వర్గం సభ్యులు పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. పీఏసీఎస్ చైర్మన్ తన్నీరు శరత్ రావు,పాలక వర్గం సభ్యులు,కాంగ్రెస్ నాయకులు ముక్కీస రత్నాకర్ రెడ్డి, ఒగ్గు దామోదర్, లింగాల శ్రీనివాస్, పీఏసీఎస్ సీఈఓ వాసు, సిబ్బంది బుచ్చయ్య, మల్లేశం, అనిల్, తదితర కాంగ్రెస్ నాయకుల, కార్యకర్తలు హజరయ్యారు.
Spread the love