నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ బత్తిని సాయిలు అన్నారు.శుక్రవారం హుస్నాబాద్ మండలంలోని పోతారం ఎస్ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఇంటి పరిసరాలలో వృధాగా ఉన్న వస్తువులలో నిల్వ ఉన్న నీటి లార్వా తీసివేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే వ్యాధులు దరిచేరకుండా ఉంటాయని గ్రామస్తులకు సూచించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎల్లయ్య, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.