హైడ్రాను అలాగే కొనసాగించాలి 

Keep the Hydra going– జిల్లా, మండల, గ్రామాలకు విస్తరించాలి
– ఎన్ హెచ్ ఆర్ సి నాయకులు 
నవతెలంగాణ –  కామారెడ్డి
జాతీయ మానవ హక్కుల సంఘం  ( ఎన్ హెచ్ ఆర్ సి ) జాతీయ చైర్మన్ ఎం డి యాసీన్,రాష్ట్ర అధ్యక్షులు బద్ధిపడగా శ్రీనివాస్ రెడ్డి ల ఆదేశానుసారము హైడ్రా కు మా పూర్తిమద్దతు( ఎన్ హెచ్ ఆర్ సి  ) ఇవ్వడం జరుగుతుందని కామారెడ్డిజిల్లా అధ్యక్షులు మర్రి మహిపాల్ ఆధ్వర్యంలోజిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు సంగీబావ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ హెచ్ ఆర్ సి జిల్లా అధ్యక్షులు మర్రి మహిపాల్ మాట్లాడుతూ  హైడ్రా ను అన్ని జిల్లాలకు మండలాలకు, గ్రామాలకు విస్తరింపజేయాలన్నారు. హైడ్రా ను ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్   ఏ.వి రంగనాథ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం యందు ఈ  హైడ్రా  పద్దతిని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లలాకు, మండలాలకు, గ్రామాలకు కూడా విస్తరంప చేయాలని  జిల్లా కలెక్టర్ సూపరిడెంట్ ప్రేమ్ కుమార్ కు వినతిపత్రం అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో  కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎస్. విజయ్ భాస్కరరావు, బురిగారి నర్సింలు, కన్వీనర్ రవీందర్ రెడ్డి, బిబిపేట్ అధ్యక్షులు సాయికుమార్, డైరెక్టర్ గంగరాజు, బిక్నూర్ అధ్యక్షులు రవి, ఉపాధ్యక్షులు సందీప్, మాచారెడ్డి అధ్యక్షులు భరత్, ఉపాధ్యక్షులు నర్సింలు, రాజంపేట్ అధ్యక్షులు శ్రీకాంత్, ఎన్ హెచ్ ఆర్ సి  సభ్యులు గొల్లపల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love