న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించారు. లిక్కర్ సకాంకు సంబంధించిన సీబీఐ కేసులో కేజ్రీవాల్‌కు ఆగస్టు 5న ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో ఆయన మరోసారి బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పటికే ఈడీ కేసులో కేజ్రీవాల్‌కి బెయిల్ మంజూరైనా.. సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో ఆయన తీహార్ జైలులోనే ఉన్నారు. కాగా, లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేిన సంగతి తెలిసిందే.