నవతెలంగాణ – ఢిల్లీ: తమ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలతో రేపు మ.12గం.కు బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని చుట్టుముట్టనున్నట్లు AAP చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రధాని మోడీ అందరినీ అరెస్ట్ చేసుకోవచ్చన్నారు. ‘అందరినీ జైలుకు పంపినంత మాత్రాన ఆప్‌ను అణచి వేయలేరు. ఆప్ అంటే ఆలోచన. ఎన్ని అరెస్ట్‌లు చేస్తే అంత విస్తరిస్తుంది’ అని అన్నారు.