జూన్ 2న లొంగిపోతా: కేజ్రీవాల్ ఉద్వేగం

 

నవతెలంగాణ – ఢిల్లీ : ఎన్నికల ప్రచారం నిమిత్తం మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ .. జూన్‌ రెండున తిరిగి లొంగిపోనున్నారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈసారి ఎంతకాలం జైలులో ఉంటానో తెలియదు. నియంతృత్వం నుంచి ఈ దేశాన్ని కాపాడేందుకు నేను జైలుకు వెళ్తున్నాను. అందుకు గర్వంగా ఉంది. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఇంటినుంచి బయల్దేరి, పోలీసుల ముందు లొంగిపోతానని కేజ్రీవాల్ చెప్పారు. ‘‘ఈసారి తనను ఇంకా వేధింపులకు గురిచేసేలా ప్రయత్నాలు జరగొచ్చు. నేను జైలుకెళ్లిన తర్వాత.. మీ (ప్రజలు) గురించే ఎక్కువ ఆలోచిస్తాను. ఈ సమయంలో మీకు ఒక హామీ ఇస్తున్నాను. మీకు అందుతున్న సేవల్లో ఎలాంటి మార్పు ఉండదు. త్వరలో నా తల్లులు, సోదరీమణులకు రూ.1,000 అందుతాయి. ఒక కుమారుడిలా నేను మీకోసం పనిచేశాను. ఈరోజు మీకొక అభ్యర్థన చేస్తున్నాను. అనారోగ్యంతో ఉన్న నా తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోండి’’ అని కోరారు.

Spread the love