కేజ్రీవాల్, కవిత కస్టడీ పొడిగింపు

నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సెప్టెంబర్ 2 వరకు పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సీబీఐ కేసులో ఈ కస్టడీ పొడిగించారు. ఇద్దరినీ తిహార్ జైలు నుంచి వర్చువల్‌గా జడ్జి ముందు అధికారులు హాజరుపరిచారు. అటు కవిత బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 20వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

Spread the love