నవతెలంగాణ – ఢిల్లీ: తన అరెస్ట్ వల్ల మీకు వచ్చిన లాభం ఏమిటని తాను ఓ బీజేపీ సీనియర్ నేతను అడిగానని… తన ప్రశ్నకు అతను చెప్పిన సమాధానం విని తాను ఆశ్చర్యపోయానని ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. సీఎం అతిశీతో కలిసి ఆయన ఢిల్లీ రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తన అరెస్ట్ వల్ల ఏం లాభం కలిగిందని అడిగితే… ఢిల్లీలో పాలన పట్టాలు తప్పిందని, పనులు ఆగిపోయానని ఓ బీజేపీ నేత సమాధానం చెప్పారని, ఇది విని తాను ఆశ్చర్యపోయానన్నారు. ఢిల్లీలో పనులు ఆగిపోయేలా చేసి, పాలన పట్టాలు తప్పేలా చేసి, ప్రజలకు అసౌకర్యం కలిగించడమే వారి ఉద్దేశమా? అని ప్రశ్నించారు. ఢిల్లీ ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, నిలిచిపోయిన పనులన్నింటినీ మొదలు పెడతానని హామీ ఇచ్చారు. అన్ని సమస్యలు క్రమంగా తొలగిపోతాయన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు కూడా యాక్షన్ మోడ్‌లోనే ఉన్నానని పేర్కొన్నారు.