కేజ్రీవాల్‌‌కు రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురు..

నవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. వైద్యపరీక్షల కోసం వారం రోజుల బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషన్ వేయగా జడ్జి తోసిపుచ్చారు. ఆయనకు ఈనెల 19 వరకు జుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ తీర్పునిచ్చారు. కాగా లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన కేజ్రీవాల్.. ఎన్నికల వేళ మధ్యంతర బెయిల్‌పై బయటికొచ్చారు. ఇటీవలే మళ్లీ జైలులో లొంగిపోయారు.

Spread the love