బెయిల్ గడువు పొడిగించాలని కేజ్రీవాల్ పిటిషన్

నవతెలంగాణ – హైదరాబాద్: మధ్యంతర బెయిల్ గడువును జూన్ 7 వరకు పొడిగించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పీఈటీ-సీటీ స్కాన్, ఇతర వైద్య పరీక్షల కోసం ఆయన గడువు కోరినట్లు ఆప్ పేర్కొంది. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయగా, జూన్ 1వరకు ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

Spread the love