ఆర్ధిక సంక్షోభంలో కేర‌ళ‌: సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్

నవతెలంగాణ- తిరువ‌నంత‌పురం: కేర‌ళ‌లో ఆర్ధిక సంక్షోభం నెల‌కొన్న‌ట్లు ఆ రాష్ట్ర సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ అన్నారు. ఈ రోజు ఆయ‌న అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర స‌ర్కార్ త‌మ‌కు నిధులు ఇవ్వ‌డంలేద‌ని, తాము తీసుకున్న రుణాల‌ను రాష్ట్ర ఇన్వెస్ట్‌మెంట్ బోర్డుకు కేంద్రం జోడిస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు. దీనితో రుణాల‌పై ప‌రిమితి వ‌ల్ల ఎక్కువ రుణాలు తీసుకోలేక‌పోతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వానికి చెందిన ప్రాజెక్టుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని కేంద్ర స‌ర్కార్‌ను అభ్య‌ర్ధిస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. కేఐఐఎఫ్‌బీ కింద ఫండింగ్ చేస్తున్న ప్రాజెక్టుల‌పై చ‌ర్చ చేప‌ట్టిన స‌మ‌యంలో సీఎం విజ‌య‌న్ ఈ స‌మాధానం ఇచ్చారు.  కేఐఐఎఫ్‌బీ ద్వారా సుమారు 13,389 కోట్ల ఖ‌ర్చు చేశామ‌న్నారు.

Spread the love