కేరళ తరహాలో ప్రాధమిక విద్యావిధానం..

Primary education system like Kerala..– విద్యా వైద్యం మౌళిక సదుపాయాల కే ప్రాధాన్యం..
– ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణా లోనూ భవిష్యత్తులో కేరళ తరహా విద్యావిధానం రానున్నది అని,అందుకు అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ లను తీర్చిదిద్దుతుంది అని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. ఐసీడీఎస్ ఆద్వర్యంలో ని అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్ధులకు అందజేసే యూనిఫాం దుస్తుల పంపిణీని ఆయన శుక్రవారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని సీసీఎస్ పాఠశాల ప్రాంగణంలోని అంగన్వాడీ కేంద్రం లో ప్రారంభించారు. సీడీ పీఓ ముత్తమ్మ అద్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యా వైద్యం మౌళిక సదుపాయాల కే నా ప్రధమ ప్రాధాన్యం అని తెలిపారు.ప్రతీ కేంద్రంలో ను విద్యుత్ సౌకర్యం,ప్రహరీ నిర్మాణం,సౌకర్యాలు కల్పిస్తానని అన్నారు. అశ్వారావుపేట ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో 29 అంగన్వాడి సెంటర్లో చదువుతున్న 509 మంది విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా ఏకరూప దుస్తులు అందించారు. అనంతరం పలువురు విద్యార్థులకు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అక్షరాభ్యాసం చేయించి అంగన్వాడి సెంటర్ పరిధిలో ఉన్న గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్,సూపర్వైజర్ లు విజయ లక్ష్మి,ఎన్.వి.ఎల్ సౌజన్య,ఎస్.వరలక్ష్మి,బి.స్వరాజ్యం,ఐ.పద్మావతి,అంగన్వాడీ టీచర్ సోమాని ఉషారాణి,దమ్మపేటమార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి,అశ్వారావుపేట పీఏసీఎస్ అద్యక్షులు చిన్నం శెట్టి సత్యనారాయణ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు తుమ్మ రాంబాబు,సీనియర్ నాయకులు జూపల్లి రమేష్,సుంకవల్లి వీరభద్ర రావు,జూపల్లి ప్రమోద్,నండ్రు రమేష్,కానూరి మోహన్ రావు లు పాల్గొన్నారు.
Spread the love