జనసేనకు కేతంరెడ్డి వినోద్ రెడ్డి రాజీనామా

నవతెలంగాణ- నెల్లూరు : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ తరుణంలో వివిధ పార్టీల నుండి ఆశావహులు రాజీనామాలు చేస్తున్నారు. ఈ క్రమంలో జనసేనకు కూడా పలువులు వరుస రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా జనసేన నెల్లూరు సిటీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ద్వారా రాజీనామా లేఖను విడుదల చేశారు. గత ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన వినోద్ రెడ్డి.. ఓటమి పాలయ్యారు. ఈసారి కూడా పోటీ చేసేందుకు పార్టీని బలోపేతం చేసే దిశగా అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. కానీ,  జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు కుదరడంతో ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నెల్లూరు నగరం నుంచి పోటీ చేసే అవకాశం లేదని తెలిసింది. నెల్లూరు సిటీ టీడీపీ ఇంఛార్జిగా మాజీ మంత్రి నారాయణ పోటీ చేస్తారని పార్టీ పెద్దలు తెలిపారని ఆయన తెలిపారు. దీంతో కేతంరెడ్డి వినోద్‌ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో నారాయణ అవినీతి, అక్రమాలపై పోటీ చేశానని తెలిపారు. అప్పటి నుండి తనను బలహినపరిచే విధంగా కుట్రలు పన్నారని తెలిపారు. ఇదిలావుండగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి సమక్షంలో కేతంరెడ్డి వైసీపీలో చేరనున్నట్టు సమాచారం.

Spread the love