తెలంగాణ విద్యుత్ శాఖ కీలక నిర్ణయం

నవతెలంగాణ హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరం వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే నూతన గృహ నిర్మాణాలు పెరుగుతుండటంతో విద్యుత్ వినియోగ శాతం కూడా భారీగా పెరిగింది.  కొత్త కరెంట్ కనెక్షన్ల కోసం పెద్ద మొత్తంలో దరఖాస్తులు వస్తుండటంతో తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌) విద్యుత్‌ వినియోగదారులకు మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మేడ్చల్‌ రూరల్‌ జోన్‌ పరిధిలోని సంగారెడ్డి ఆపరేషన్‌ సర్కిల్‌ను మేడ్చల్‌ జోన్‌లో కలుపుతున్నట్టు టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ ఆదేశాలు జారీ చేశారు.
జూలై 1 నుంచి సంగారెడ్డి ఆపరేషన్‌ సర్కిల్‌ నిర్వహణ మొత్తం మేడ్చల్‌ జోన్‌ పరిధిలోకి వస్తుందని పేర్కొన్నారు. సంగారెడ్డి సర్కిల్‌ మేడ్చల్‌ జోన్‌లోకి రావడంతో జోన్‌లో సర్కిళ్ల సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటికే మేడ్చల్‌, హబ్సిగూడ సర్కిళ్లు మేడ్చల్‌ జోన్‌ పరిధిలో ఉన్నాయి.

Spread the love