ఆస్పత్రిలో కేసీఆర్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న రాత్రి ఆయన ఇంట్లో కాలుజారి పడటంతో తుంటి ఎముక విరిగి గాయమైనట్లు సమాచారం. దీంతో గురువారం అర్ధరాత్రి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో ఆయన్ను చేర్చారు. ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌కు చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఈ విషయం పై రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. యశోద ఆస్పత్రి దగ్గర భద్రత పెంచాలని..కేసీఆర్‌ కు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు ఇచ్చారు సీఎం రేవంత్‌ రెడ్డి.
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పరిరక్ష్టించాలని వైద్యా ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో రిజ్వీ యశోద ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని సీఎం రెవంత్ రెడ్డికి వివరించారు. ఇది ఇలా ఉండగా.. పలువురు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్​ను పరామర్శించేందుకు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. మరోవైపు పలువురు నేతలు సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ ఆరోగ్యంపై తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేసీఆర్ ఆరోగ్యంపై ట్వీట్ చేశారు. ఆయనకు గాయమైందని తెలిసి బాధగా ఉందని.. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని మోడీ ట్వీట్​లో పేర్కొన్నారు.

Spread the love