నవతెలంగాణ – పాకిస్థాన్
పాకిస్థాన్‌లో తలదాచుకున్న ఖలిస్థానీ ఉగ్రవాది లఖ్‌బీర్ సింగ్ రోడే మరణించాడు. డిసెంబర్ 2వ తేదీన గుండెపోటుతో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సిక్కు ఆచార సంప్రదాయాలను అనుసరించి పాక్‌లోనే రోడే అంత్యక్రియలు రహస్యంగా పూర్తి చేసినట్లు సదరు వర్గాలు తెలిపాయి. పంజాబ్‌లో ఖలిస్తాన్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే మేనల్లుడే ఈ రోడే. ఖలిస్థానీ లిబరేషన్ ఫోర్స్, ఇంటర్నేషనల్ సిఖ్ యూత్ ఫెడరేషన్ సంస్థలకు రోడే చీఫ్‌గా వ్యవహరిస్తున్నాడు. అతడిని భారత ప్రభుత్వం గతంలోనే ఉగ్రవాదిగా ప్రకటించింది.