ఖమ్మం బీఆర్ఎస్ కు మరో షాక్

– పార్టీ వీడనున్న సీనియర్ నేత జలగం
– నేడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి

నవతెలంగాణ కొత్తగూడెం: కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కారు దిగి చేయి అందుకొనున్నారు.  గత కొంత కాలంగా బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. నేడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇందు కోసం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఢిల్లీకి చేరుకున్నారు.

Spread the love