ఖతర్నాక్‌ కావేరప్ప

– 4 వికెట్లతో చెలరేగిన పేసర్‌
– దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌

బెంగళూర్‌ : పేసర్‌ విద్యుత్‌ కావేరప్ప (4/44) నిప్పులు చెరిగాడు. నాలుగు వికెట్ల ప్రదర్శనతో విజృంభించిన విద్యుత్‌ కావేరప్ప దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో వెస్ట్‌ జోన్‌ భరతం పట్టాడు. మరో పేసర్‌ విజరు కుమార్‌ వైశాక్‌ (2/29) సైతం రాణించటంతో సౌత్‌ జోన్‌ పట్టు బిగించింది. ఓపెనర్‌ పృథ్వీ షా (65, 101 బంతుల్లో 9 ఫోర్లు) అర్థ సెంచరీతో కదం తొక్కినా.. మిగతా బ్యాటర్లు రాణించలేదు. ప్రియాంక్‌ పంచల్‌ (11), హార్విక్‌ దేశారు (21), చతేశ్వర్‌ పుజారా (9), సూర్యకుమార్‌ యాదవ్‌ (8), సర్ఫరాజ్‌ ఖాన్‌ (0) విఫలమయ్యారు. 129 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన వెస్ట్‌ జోన్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 84 పరుగుల వెనుకంజలో కొనసాగుతుంది. ఇక సౌత్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 78.4 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ హనుమ విహారి (63), తిలక్‌ వర్మ (40) రాణించారు. మరో మూడు రోజుల ఆట మిగిలి ఉండటంతో విజయమే లక్ష్యంగా సౌత్‌ జోన్‌ దూసుకెళ్తోంది.

Spread the love