సికింద్రాబాద్ స్టేష‌న్‌లో కిడ్నాపైన బాలుడి ఆచూకీ ల‌భ్యం

నవతెలంగాణ – సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో 5ఏండ్ల బాలుడు కిడ్నప్‌కు గురయ్యాడు. కిడ్నాప్‌ చేసిన వారిని బెగ్గింగ్ మాఫియా ముఠాగా అనుమానిస్తున్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయాలపురానికి చెందిన దుర్గేశ్, తన 5 ఏళ్ల కుమారుడి శివ సాయితో కలిసి తిరుమల వెళ్ళాడు. ఈనెల 28న తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు. ఆ రోజు ఉదయం 5.30కు సికింద్రాబాద్ స్టేషన్‌లో దిగిన దుర్గేశ్‌.. అలిసిపోయి స్టేషన్‌లోనే పడుకున్నాడు. అనంతరం సాయంత్రం 4.30కు దుర్గేశ్.. తన కుమారుడిని బ్యాగులతో పాటు ప్లాట్ ఫామ్ నెంబర్ 1 వద్ద ఉంచి వాష్‌రూం వెళ్లాడు. వచ్చి చూసేలోపు బాబు కనిపించలేదు. దీంతో స్టేషన్‌లో ఉన్న జీఆర్‌పీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా గుర్తు తెలియని దంపతులు బాబును కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నట్లు గుర్తించారు. ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. అయితే తప్పిపోయిన బాలుడు.. మూగ, చెవిటి అని తండ్రి దుర్గేశ్ చెబుతున్నారు.
 బాలుడి ఆచూకీ ల‌భ్యం
సికింద్రాబాద్ స్టేష‌న్‌లో అప‌హ‌ర‌ణ‌కు గురైన బాలుడి ఆచూకీ ల‌భ్య‌మైంది. బాలుడిని కిడ్నాప‌ర్ మాదాపూర్‌లో వ‌దిలేసి వెళ్లిన‌ట్లు పోలీసులు గుర్తించారు. బాలుడు ప్ర‌స్తుతం సుర‌క్షితంగా ఉన్న‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. బాలుడిని అత‌ని త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గిస్తామ‌న్నారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా బాలుడి ఆచూకీని పోలీసులు గుర్తించారు.

Spread the love