ఇల్లందులో కౌన్సిలర్ల కిడ్నాప్.. 144 సెక్షన్ !

నవతెలంగాణ – ఇల్లందు: ఇల్లందు మున్సిపాలిటీ అవిశ్వాసంలో హైడ్రామా నడుస్తోంది. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా వచ్చిన కొంతమంది కౌన్సిలర్లను కాంగ్రెస్ నాయకులు అలాగే కార్యకర్తలు కిడ్నాప్ చేశారు. మున్సిపల్ చైర్మన్ డివి పై అవిశ్వాసం కోరిన కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రక్రియ సవ్యంగా జరిగేందుకు తమకు రక్షణ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు.  హైకోర్టు సదరు కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇల్లందు పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ విధించారు. అయితే మరికొద్ది క్షణాలలో అవిశ్వాస ప్రక్రియ మొదలవుతుంది అనగా ఎంపీడీవో కార్యాలయం పై… కాంగ్రెస్ కార్యకర్తలు…దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. హైకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా పోలీసులు ముందే… ఇద్దరూ టిఆర్ఎస్ కౌన్సిలర్లు, ఒక సిపిఐ కౌన్సిలర్ను లాక్కేల్లారు. ప్రజాస్వామ్య రక్షణ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇదే తీరున వ్యవహరించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీంతో తమ కౌన్సిలర్లను కాంగ్రెస్ నాయకులు కిడ్నాప్ చేశారంటూ టిఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది.

Spread the love