Kidney Problems : కిడ్నీలు.. బీన్ ఆకారంలో ఉండే అవయవాలు.. వెన్నెముకకి దగ్గరగా ఉంటాయి. ఇవి శరీరం సరిగ్గా పనిచేయడానికి కీ రోల్ పోషిస్తాయి. కెమికల్స్, మన శరీరంలోని వ్యర్థాలను ఫిల్టర్ చేయడం, శరీరంలోని అదనపు నీటిని తొలగించడం వంటి పనులు చేస్తాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయనప్పుడు, రోగులు డయాలసిస్ ట్రీట్‌మెంట్ చేయించుకోవలసి ఉంటుంది. మరి పరిస్థితి చేజారితే మార్చడం కూడా ఉంటుంది. కాబట్టి ముందు నుంచి కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
కిడ్నీల విషయంలో ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. దీని వల్ల ఎలాంటి సమస్యలు రావు. కానీ, కొంత మంది నిర్లక్ష్యం చేసేసరికి అది ప్రాణాల మీదకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అనే వ్యాధి గురించి తెలుసుకుందాం. కిడ్నీల్లో పెరిగే తిత్తులనే ఈ సమస్య అంటారు. పూర్తి వివరాలు ఏంటంటే..
కారణాలు ఏంటంటే..
ఇండియాలో కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి షుగర్ వ్యాధి, హై బీపి కారణాలు. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండేందుకు రెగ్యులర్‌గా చెకప్స్, ట్రీట్‌మెంట్ అనేది చాలా అవసరం.
పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్(PKD) వివిధ వయసులు, జాతుల వ్యక్తులపై ప్రభావం చూపుతుంది. పురుషులు, మహిళలు ఇద్దరూ కూడా ఈ పరిస్థితికి ఇబ్బంది పడతారు. పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అనేది చాలా ప్రపంచంలో 400 నుండి వెయ్యి మందిలో ఒకరిని ప్రభావితం చేస్తుంది. ఇది పిల్లల్లో కూడా కనిపిస్తుంది. 20 వేల మంది యువకులలో ఒకరు పీకేడి ద్వారా ఇబ్బంది పడతారు.