నవతెలంగాణ-హైదరాబాద్ : సరూర్ నగర్ అలకనంద ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి దందాకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ‘కిడ్నీ రాకెట్‌లో పవన్ అనే వ్యక్తి వైద్యులు, రోగులు, దాతలకు మధ్యవర్తిగా ఉన్నాడు. రాజశేఖర్, ప్రభ రిసీవర్లుగా ఉన్నారు. సుమంత్ ఆస్పత్రిని నిర్వహిస్తుండగా అవినాశ్ అనే వైద్యుడు సర్జరీలు చేశాడు. ఒక్కో సర్జరీకి ₹50-60లక్షలు వసూలు చేశారు. ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్ చేశాం’ అని తెలిపారు.