పొట్టి ప్రపంచకప్ ఫైనల్లో టీమ్ఇండియా సూపర్ విక్టరీ సాదించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ఇండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో పెద్దగా రాణించని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (76; 59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫైనల్లో మాత్రం కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం కీంగ్ కోహ్లీ కీలక ప్రకటన చేశాడు. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటింస్తున్నట్లు విరాట్ వెల్లడించాడు. ‘‘భారత్ తరఫున ఇదే నా చివరి టీ20, చివరి టీ20 ప్రపంచ కప్ అన్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ తనకు చివరి టీ20 అని కోహ్లీ తెలిపాడు. మేం సాధించాలనుకున్నది ఇదే. నేను ఈ ప్రపంచ కప్ గెలవాలని కోరుకున్నా. ఒకవేళ వరల్డ్ కప్ సాధించకపోయినా రిటైర్మెంట్ ప్రకటించేవాడిని. తర్వాతి తరానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే తను వెనక్కి తగ్గితున్నట్టు విరాట్ తెలిపాడు. ఐసీసీ టోర్నమెంట్‌ను గెలవడానికి మేము చాలా కాలం వేచి ఉన్నాం. భారత్ తరుపున రోహిత్ శర్మ 9 టీ20 ప్రపంచ కప్‌లు ఆడాడు. తనకు ఇది ఆరో ప్రపంచ కప్ అన్నారు. ఈ వరల్డ్ కప్ విజయానికి రోహిత్ అర్హుడు. భావోద్వేగాలను నియంత్రించుకోవడం కష్టంగా ఉంది. ఇది అద్భుతమైన రోజు’’ అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.
వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్ సాధించిన అతికొద్దిమంది భారత క్రికెటర్లలో కోహ్లీ ఒకడు. టీమ్ఇండియా 2011 వన్డే ప్రపంచ కప్ సాధించిన జట్టులో సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. కోహ్లీ 2010లో జింబాబ్వేపై టీ20 అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో మొత్తం 125 టీ20లు ఆడి 48.69 సగటుతో 4188 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, 38 అర్ధ సెంచరీలు సాధించాడు.