– రాష్ట్రానికి బడ్జెట్లో అన్యాయం జరిగిన బిజెపి ఎంపీలు నోరు ముసుకోవడం సిగ్గు చేటు…
– ఆందోళన వద్దు..బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం..
– నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి..
నవతెలంగాణ – డిచ్ పల్లి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో ఉన్న ప్రజలను, రైతులను, యువకులను రెచ్చగొట్టే విధంగా రచ్చబండ కార్యక్రమం చేపట్టాలని పిలిపియ్యడం, కిషన్ రెడ్డి మితిస్థిమితం లేక మాట్లాడటం శోషనీయమని, సిగ్గుచేటని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. బుదవారం ఇందల్ వాయి మండలంలోని మేగ్యనాయక్ తాండ, నల్లవెల్లి, స్టేషన్ తండా,గౌరరం,ఇందల్ వాయి గ్రామాలలో మృతి చెందిన పలు కుటుంబాలను బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ గత పదేళ్ల క్రితం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి రిఅర్గనైజేషన్ బిల్లులో పొందుపరిచిన అంశాలను కేంద్ర ప్రభుత్వం విస్మరించిన రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది బిజెపి ఎంపీలు ఉన్న నోరు మెదపకపోవడం విచారకరమన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చెయ్యి చూపిన ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉన్నారని, పైపెచ్చు ప్రజలను రెచ్చగొట్టే విధంగా రచ్చబండ కార్యక్రమం అని ప్రకటించడం సిగ్గుచేటన్నారు. 8 నెలల క్రితమే రాష్ట్రంలో అధికారంలో కొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన ప్రతి హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పై అబద్ధాలు వేయడమే బిజెపి , బిఅర్ఎస్ పార్టీ లుపనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. దేశంలోని ఏ రాష్ట్రం చేయని విధంగా రైతంగానికి రెండు లక్షల రూపాయలను మాఫీ చేస్తున్నామని ఈ నెల 14న మూడో విడత రెండు లక్షల రూపాయలను మాఫీ చేపట్టడం జరుగుతుందన్నారు. ఇదే కాకుండా కొందరికి మాఫీ కాలేదని వెంటనే విస్తరణ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని ఎవరికైతే రుణమాఫీ రాలేదో వారు కలిసి వివరాలను అందజేస్తే ఈ నెలలోనే వారికి కూడా మాఫీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. రేషన్ కార్డు నిబంధన కుటుంబం లో ఉన్న సభ్యులను గుర్తించడానికి తప్ప రైతుగా కాదని ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. వ్యవసాయాన్ని దండగ కాదు. పండగ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు.
ఇప్పటికి రాష్ట్రంలో పాలించిన వారు గొప్పలకు పోయారని కానీ గత కొన్ని రోజుల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ సైతం విడుదల చేసి ప్రభుత్వ చిత్తశుద్ధిని వెల్లడించారన్నారు. వచ్చే ఖరీఫ్ నుండి రైతు భీమా వర్తించే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. రెండు నెలల్లోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, రూరల్ లోని అయినా గ్రామాలలో అర్హులైన వారికి ముందుగా ఇందిరమ్మ ఇళ్లకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్ర రి ఆర్గనైజేషన్ బిల్లు లో పొందుపరిచిన అంశాలను విస్మరించిందని దానిపై కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్న పల్లెత్తు మాట కూడా మాట్లాడకపోవడం మరి చిత్తశుద్ధికి రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనమన్నారు. గత పదేళ్లుగా రాష్ట్రానికి రావలసినవి రాకున్నా, పొందు పరిచిన అంశాల వాటికి ఏమి చేయని స్థితిలో కేంద్రం ఉందన్నారు. రాష్ట్రంలో రచ్చబండ కాదు కేంద్రంలో బిజెపి ఎంపీలు ఇద్దరు మంత్రులు అక్కడ ధర్నాలు చేసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టే విధంగా బిజెపి ఎంపీలు, కేంద్ర మంత్రులు చూడాలని సూచించారు. వివిధ కారణాల రిత్యా మృత్యువాత పడ్డ కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎలాంటి సహాయ, సహకారాలు కావాలన్నా నేనున్నానని ఎమ్మెల్యే వారికి మనో ధైర్యం, భరోసా కల్పించారు. అతనిలో గత నెలలో హత్యకు గురైన వెంగల్ కూతుర్లకు గురుకులాల్లో చదివించే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని హత్య చేసిన వారికి ఉపేక్షించకుండా చూడాలని డిచ్పల్లి సీఐ కి మల్లేష్ ఎస్ఐ మనోజ్ కుమార్ కు ఎమ్మెల్యే ఆదేశించారు.అనంతరం పరువురికి తన వంతుగా ఆర్థిక సహాయం అందజేశారు.
కలెక్టర్ కు ఎమ్మెల్యే ఫోన్..
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో గల్ఫ్ కు వెళ్ళిన వారు, వివిధ కారణాల చేత మృతి చెందిన వారు ఉన్నారని వారి పేరుపై బ్యాంకుల్లో, సహకార సొసైటీలో రుణాలు తీసుకున్న రైతులు, భార్యలకు ఒక గుంట భూమి లేకున్నా భర్తల పేరుపై రుణాలు పొందాలని ఆ రుణాలు మాఫీ కాలేదని వెంటనే వారందరికీ వర్తించే విధంగా చూడాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి కి విన్నవించారు.నల్లవెల్లి సహకార సొసైటీ పరిధిలో దాదాపు 100 మంది వరకు రైతులకు రుణమాఫీ కాలేదని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వచ్చారు. ఇదే విషయమై జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కు ఫోన్ చేసి వివరాలను తెలిపారు వారందరికీ న్యాయం జరిగే విధంగా చూడాలని ఎమ్మెల్యే కలెక్టర్ కు కోరారు. వివిధ కారణాల రిత్యా అన్ని గ్రామాల్లో పలువురికి రుణమాఫీ కాలేదని మాఫీ కానీ వారి లిస్టును వెంటనే అందజేసే విధంగా చూడాలని సహకార సొసైటీ చైర్మన్లు చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సీఈవో తేజ గౌడ్ లను ఎమ్మెల్యే ఆదేశించారు. తను సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయం తీసుకొని వెళ్లి అందరికీ మాఫీ అయ్యే విధంగా చూస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోత్కూరి నవీన్ గౌడ్, డిసిసిబి డైరెక్టర్ కోరట్ పల్లి అనంద్, డిసిసి డెలిగేట్లు వెంకట్ రెడ్డి, సుధాకర్, దర్పల్లి మాజీ ఎంపీపీ, ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఇమ్మడి గోపి, బ్లాక్ కాంగ్రెస్ రూరల్ అద్యక్షులు సంతోష్ రెడ్డి, కిసాన్ ఖేత్ మండల అధ్యక్షులు ఎల్ ఐ సి గంగాధర్, మాజీ ఎంపిటిసి చింతల కిషన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బోర్వేల్ రాజేందర్ రెడ్డి, సుధాకర్ నాయక్,రాజు నాయక్, మాజీ వైస్ ఎంపీపీ పూర్య నాయక్,ముత్యాన్న, జంగిలి లక్ష్మీ, నారాయణ నాయక్, మోతిలాల్, షేక్ సద్దాం, జమీల్ పాషా,మొచ్చె గోపాల్, పెట్రోల్ బంక్ రమేష్ నాయక్, దశర థ్,కాడరి, నవీన్ గౌడ్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.