బీజేపీ ఎమ్మెల్యేలతో కిషన్‌రెడ్డి భేటీ…

BJp-MLAsనవతెలంగాణ – హైదరాబాద్‌: నూతనంగా ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి  సమావేశమయ్యారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలను కిషన్‌రెడ్డి సన్మానించారు. అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానుండటంతో సభలో లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలపై చర్చించారు. అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని బీజేపీ ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. మరోవైపు, తొలి రోజు బీజేపీ ఎమ్మెల్యేలు సభకు వెళ్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై రాష్ట్ర నాయకత్వానికే స్పష్టత లేకుండా పోయింది. అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణ అసెంబ్లీకి ప్రోటెం స్పీకర్ అయితే తనతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చెయ్యరని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పార్టీ రాష్ట్ర నాయకత్వం సమావేశాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం.

Spread the love