నవతెలంగాణ హైదరాబాద్: కేటీఆర్ అరెస్ట్ పై గవర్నర్ సరైన నిర్ణయం తీసుకుంటారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గవర్నర్ న్యాయ నిపుణులను సంప్రదించిన అనంతరం.. వారి న్యాయ సలహాతో సరైన నిర్ణయం తీసుకుంటారని అన్నారు. కొంత జాప్యం జరిగినంత మాత్రన బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరంపై విచారణ చేయాలని తామే డిమాండ్ చేశామని, సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడూ విచారణ కోరలేదని ఆయన అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రాష్ట్రాభివృద్ది వదిలేసి స్వంత ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.