KKR vs RR : సునీల్ నరైన్ అధ్బుత సెంచరీ..రాజస్థాన్ కు భారీ లక్ష్యం

నవతెలంగాణ-హైదరాబాద్ : ఈడెన్ గార్డెన్స్‌లో మరో సారి పరుగుల వరద పారింది. రాజస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జట్టు నిర్ణిత 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 223 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన నైట్ రైడర్స్ ఆరంభంలో సాల్ట్ వికెట్ కోల్పోయింది. కాని మరో ఓపెనర్ సునిల్ నరైన్ (56 బంతుల్లో 109) పరుగులతో అద్భుత బ్యాటింగ్ తో సుపర్ సెంచరీ చేశాడు. దీంతో నైట్ రైడర్స్ బారీ స్కోరు చేసింది. మిగత బ్యాట్స్ మెన్లలో రఘువంశీ (30), చివర్లో రింకూసింగ్ (20 నాటౌట్) పరుగులు చేశారు. మిగత బాట్స్ మెన్లు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. రాజస్థాన్ బౌలింగ్ లో ఆవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్ రెండేసి వికెట్లు తీయగా బౌల్ట్, చాహల్ చేరో వికెట్ తీసుకున్నారు.

Spread the love