బీఆర్ఎస్ పార్టీకి రాజీనామ చేసిన కేఎల్ఎన్..

– అవమానాలు బరించ లేక..

– ఓపిక నశించి పార్టీకి రాజీనామా చేస్తున్నా..
– బీసీ నాయకుడు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా..

నవతెలంగాణ -కోదాడరూరల్
ద్వితీయ శ్రేణి నాయకులకు బీఆర్ఎస్ పార్టీ లో సముచిత స్థానం కల్పించకపోగా పార్టీలో చేసిన అవమానాలు భరించలేక  కౌండిన్య గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ వార్డు కౌన్సిలర్  కేఎల్ ఎన్ ప్రసాద్ బీఆర్ఎస్ పార్టీకి బుధవారం రాజీనామా చేశారు. బీసీ వర్గానికి చెందిన నాయకుడు రాజీనామా చేయడంతో నియోజకవర్గంలో పెద్ద చర్చగా మారింది. ఈ సందర్భంగా పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2015 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు తనకు నామినేటెడ్ పోస్టు ఇస్తానని చెప్పడంతో పార్టీలో చేరానని అన్నారు. అప్పటినుండి పార్టీ అభివృద్ధికి ఎన్నలేని కృషి చేశానని, కౌన్సిలర్స్ అసోసియేషన్ స్థాపించి రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీల్లో ఉన్న కౌన్సిలర్ని డిఆర్ఎస్ పార్టీలో చేర్పించానని అన్నారు. కౌండిన్య గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా అనేక నియోజకవర్గాలలో గౌడ కులస్తులను టిఆర్ఎస్ పార్టీలో చేర్పించి పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషిచేశానని 2018 ఎన్నికలలో అనేక నియోజకవర్గాలలో ముఖ్యంగా కోదాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అని గెలిపించడంలో ఎనలేని కృషి జరిపినానని అన్నారు స్థానిక సంస్థలలో వివిధ మండలాలలో ఇన్చార్జిగా ఉండి పార్టీ అభివృద్ధికి కృషి జరిపినానని కానీ అప్పటినుండి ఇప్పటివరకు నాకు ఎలాంటి పదవి లభించలేదు ఏ విధంగా కూడా పార్టీ నుండి ప్రభుత్వం నుండి ఎలాంటి ఫలితములు లభించలేదని కావున తీవ్ర మనస్తాపతో ఓపిక నశించి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి కేఎల్ఎన్ ప్రసాద్ ని ఆయన నివాసంలో కలిశారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని ఆమె ఇచ్చారు. దీంతో సుమారు 500 మందితో త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు.
Spread the love