
నవతెలంగాణ హైదరాబాద్: ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లో భారత టాపార్డర్ చెలరేగి ఆడింది. విరాట్ కోహ్లీ(122 నాటౌట్ 94 బంతుల్లో ఫోర్లు, సిక్స్‌లు), కేఎల్ రాహుల్(111 నాటౌట్) శతకంతో విజృంభించారు. ఫహీం అష్రఫ్ వేసిన 50వ ఓవర్లో కోహ్లీ వరుసగా మూడు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. దాంతో, భారత్ 2 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసి పాక్ ముందు భారీ టార్గెట్ ను పెట్టింది.