బాధితురాలికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందించిన కోలా రమేష్..

నవతెలంగాణ-హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామానికి చెందిన సుభద్ర తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాదు ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందింది. ఈ విషయాన్ని అదే గ్రామానికి చెందిన కోలా రమేష్ గౌడ్ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకువచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)కి దరఖాస్తు చేశారు. అధికారులు స్పందించి సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.55,000 మంజూరు చేశారు. దీనికి సంబంధించిన పత్రాన్ని అందజేశారు. దీంతో వల్లపు సుభద్ర గారికి సీఎంఆర్ఎఫ్ నుంచి 55.000రూపాయలు అందించాడు కోలా రమేష్ గౌడ్. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిసు భయాలు, రాంపల్లి నవీన్ గౌడ్, దాస గాని నాగరాజు పాల్గొన్నారు.

Spread the love