ప్రతి ఎకరాకు నీరు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

– ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తాం 
– తుమ్మల నాగేశ్వరరావు
– గోదావరి జలాలతో ఆలేరు నియోజకవర్గం సస్యశ్యామలం
బీర్ల ఐలయ్య
– దిగువ ప్రాంతాలకు నీటి విడుదల 
నవతెలంగాణ-యాదగిరిగుట్ట రూరల్ : నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీరు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం, యాదగిరిగుట్ట మండలం జంగంపల్లి వద్ద ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ పాయింట్ నీ నిర్మించి దిగువ గ్రామాలకు నీటిని  ఉమ్మడినల్లగొండ జిల్లా ఇంచార్జి మంత్రి, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిలుగ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి, నీటిని విడుదల చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల, రైతుల మీద ప్రేమతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తుందని అన్నారు. రైతు భరోసా ఇస్తామని, మిగిలిపోయిన రైతు రుణ మాఫీ తప్పకుండా చేస్తామని అన్నారు. మూసి ప్రక్షాళన చేసి తీరుతామని అన్నారు. తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ గంధమల్ల కోసం గతంలో గత ప్రభుత్వాలతో ఎంతో కొట్లాడామని అన్నారు. గత టిడిపి, వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాలతో కొట్లాడి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ జిల్లా నీటిపారుదల కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. గతంలో నష్టపోయిన ఈ ప్రాంతానికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నీరు అందించి సస్యశ్యామలం చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తో ఎంతోకొట్లాడి రోడ్లు తెస్తున్నామని అన్నారు. కరువు కాట కలకు నిలయమైన ఉమ్మడి నల్లగొండ జిల్లాను ఈ నాలుగు సంవత్సరాలలో అభివృద్ధి చేస్తామని అన్నారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బస్వాపూర్ కు పోయే కాలువలను ఇక్కడ డిస్ట్రిబ్యూటరీ పాయింట్స్ ఏర్పాటు చేసి ఇక్కడున్న చెరువులకు నీరు అందించే సంకల్పం ఎంతో గొప్పదని అన్నారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ జలయజ్ఞం లో భాగంగా ఆలేరు నియోజకవర్గానికి ఇప్పటికే నలుమూలలకు నీరు అందించమని అన్నారు. మరో 20 గ్రామాల చెరువులు, కాల్వలకు, నీరు అందించనున్నామని అన్నారు. యాదగిరిగుట్ట మండలం జంగంపల్లి వద్ద సొంత నిధుల తో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ధ్వారా యాదగిరిగుట్ట మండలం జంగంపల్లి, ధాతర్ పల్లి, రాళ్ళ జనగం, మల్లాపూర్, సైదాపూర్, మాసాయిపేట, తాళ్ల గూడెం, మైలర్ గూడెం ఇతర గ్రామాలకు నీరు చేరుతుంది అన్నారు. అదేవిధంగా మండలంలోని జంగంపల్లి, రాళ్ళ జనగం, ధాతర్ పల్లి, గొల్లగుడిసెలు, యాదగిగుట్ట, వంగపల్లి, చోల్లేరు, మోటకొండూరు, చాడ, ఆత్మకూరు మండలంలోని బీక్కేరు వాగు వరకు ఈ నీరు చేరుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఐనాల  చైతన్య మహేందర్ రెడ్డి, గుడిపాటి మధుసూదన్ రెడ్డి, మండల నాయకులు కర్రె వీరయ్య, మాజీ ఆలేరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎడ్ల రామ్ రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా మదర్ డైరీ డైరెక్టర్, మాజీ సర్పంచ్ పుప్పల నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love