నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి భువనగిరి ఎంపీ, నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘టీపీసీసీ అధ్యక్షుడు… లోక్ సభ సభ్యుడు రేవంత్ రెడ్డికి వెరీ హ్యాపీ బర్త్ డే’ అని కోమటిరెడ్డి ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి 8 నవంబర్ 1969లో జన్మించారు. ఆయన వయస్సు 54. 2006లో జెడ్పీటీసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అక్కడ ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం… ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి చేరుకున్నారు.