మోడల్ స్కూల్ అన్యువల్ డే లో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ పట్టణ కేంద్రం లక్కారంలో ఉన్న మోడల్ స్కూల్ అన్యువల్ డే సందర్భంగా శనివారం ముఖ్యఅతిథిగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 2013 భువనగిరి పార్లమెంటు పరిధిలో నేను ఎంపీగా 26 మోడల్ స్కూల్స్ శంకుస్థాపన చేశానని అన్నారు.నా చేతుల మీదగా స్కూల్స్ ను శంకుస్థాపనలు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.ఈ పోటీ ప్రపంచంలో అబ్బాయిల కన్నా అమ్మాయిలే ప్రతి ఒక్క రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు.ఈ మోడల్ స్కూల్స్ నుంచి డి ఆర్ డి ఓ కేంద్ర ప్రభుత్వ సంస్థలో సైంటిస్ట్ గా పని చేస్తున్నా అమ్మాయిని ప్రత్యేకంగా అభినందించారు.ఈ సంస్థకు మరియు తల్లిదండ్రులకు గర్వకారణంగా ఉంటుందని రాజగోపాల్ రెడ్డి అన్నారు.రాజగోపాల్ రెడ్డి విద్యార్థులతో మాట్లాడుతూ జీవితంలో చదువు ఎంత ముఖ్యమో సంస్కారం కూడా అంతే ముఖ్యం అన్నారు.విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని సూచించారు.మీకు ఏ సమస్యలు ఉన్న పరిష్కరించే బాధ్యత నాది..క్రమశిక్షణతో కష్టపడి చదివే బాధ్యత మీది అని రాజగోపాల్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యం అందరికీ ఆకట్టుకుంది.మోడల్ స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు కేరింతలు వేస్తూ స్టెప్పులతో డ్యాన్సులు చేశారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి జడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి వైసిపి ఉప్పు భద్రయ్య మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీశైలం గౌడ్ ఆర్డిఓ కేఎంవి జగన్నాధ రావు తహసిల్దార్ హరికృష్ణ ఎంపీడీవో సందీప్ కుమార్ మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి వార్డు కౌన్సిలర్లు కొయ్యడ సైదులు గౌడ్ కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి చౌటుప్పల్ బ్లాక్ మండల పట్టణ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి బోయ దేవేందర్ సుర్వి నరసింహ గౌడ్ ఎంపీటీసీలు జెల్ల ఈశ్వరమ్మవెంకటేశం,చింతల వెంకటరెడ్డి,గుండు మల్లయ్య గౌడ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ దీప తదితరులు పాల్గొన్నారు
Spread the love