నవతెలంగాణ- మేడ్చల్
మేడ్చల్ మండల మీడియా ప్రతినిధులకు బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు కొంపల్లి మోహన్ రెడ్డి క్షమాపణలు తెలియజేశారు. ఆదివారం మేడ్చల్ పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మేడ్చల్ నియోజకవర్గ మహాజన్ సంపార్క్ అభియాన్ సంయుక్త మోర్చాల సమ్మేళనంలో భాగంగా బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు కొంపల్లి మోహన్ రెడ్డి మాట్లాడుతూ పేపర్ వోడు 500మంది వరకు కార్యకర్తలు వస్తేనే మన న్యూస్ రాస్తారు లేకపోతే రాయరు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల పై మేడ్చల్ మండల ప్రింట్ మీడియా ఉపాధ్యక్షుడు శివ కుమార్ ఫోన్ లో వారిని వివరణ కోరగా తాను కావాలని మీడియా ప్రతినిధులను కించ పరచలేదని అట్లా అంటే మీకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దుబ్బాక ఎమ్మెల్యే రఘు నందన్ రావు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్య క్రమంలో మేడ్చల్ జిల్లా బీజేపీి రూరల్ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షు డు కొండం ఆంజనేయులు ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి ప్రేమ్ దాస్, మహిళా మోర్చా అధ్యక్షురాలు కష్ణ ప్రియ మల్లారెడ్డి, మున్సిపల్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, రామన్న గారి శ్రీనివాస్ గౌడ్, కిషన్ రావు పాల్గొన్నారు.