ప్రొఫెస‌ర్ సాయిబాబా మృతిప‌ట్ల కూనంనేని , నారాయ‌ణ సంతాపం

నవతెలంగాణ-హైద‌రాబాద్ : ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌, మాన‌వ హ‌క్కుల ఉద్య‌మ నేత జీఎన్‌ సాయిబాబా మృతిప‌ట్ల సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంతాపాన్ని ప్రకటించారు. వారి మరణం సమాజానికి తీరని లోటుని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నట్లు సాంబశివరావు తెలిపారు.
ప్రాఫెసర్ సాయిబాబా మరణంపట్ల ప్రగాఢ సంతాపం తెలియజేయస్తున్న‌ట్లు సీపీఐ నారాయ‌ణ పేర్కొన్నారు. నిజజీవితంలో వికలాంగుడయినా ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదిరించి రాజీలేని పొరాటం చేశారు. అయితే తన శరీరంతో ఓడిపోయారు . పోరాటయోధులు సాయిబాబా భౌతికంగా మనతో లేకపోయినా ఆయ‌న పోరాట స్ఫూర్తి ఎప్ప‌టికీ గుర్తుంటుంద‌న్నారు. సాయిబాబా కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు నారాయ‌ణ‌.

Spread the love