– బిఆర్ఎస్ పార్టీ మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు రాఘవ రెడ్డి
నవ తెలంగాణ మల్హర్ రావు.
పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపే లక్ష్యంగా ప్రతి బిఆర్ఎస్ కార్యకర్త విధిగా పని చేయాలని మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు రాఘవ రెడ్డి పిలుపునిచ్చారు.బిఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇంఛార్జి పెద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మదుకర్ ఆదేశాల మేరకు మండలంలో ఎడ్లపల్లి, రుద్రారం గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు శనివారం కార్నర్ సమావేశాలు నిర్వహించారు.ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కోరారు.ఎన్నికలు వస్తేనే కాంగ్రెసోళ్లకు పథకాలు గుర్తుకొస్తాయని, ఎన్నికల తర్వాత వాటి అమలును దాటవేస్తారని, అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఇంతవరకు ఎందుకు చేయలేదో ప్రజలు ఆలోచన చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో కొప్సన్ ఆయూబ్ ఖాన్,పిఏసిఎస్ చైర్మన్ రామారావు, యూత్ అధ్యక్షుడు జాగరి హరీష్,తాజాద్దీన్, యాదగిరి రావు, కార్యకర్తలు పాల్గొన్నారు