
యునైటెడ్ అరబ్ ఎమి గ్రేడ్స్ లోకి అబుదాబి లో సోమవారం ప్రపంచ వాణిజ్య సంస్థ ఆధ్వర్యంలో 13వ ప్రపంచ మంత్రుల స్థాయి సమావేశం ప్రారంభమైనది. అనేక దేశాల వాణిజ్యమంత్రులు ఎన్జీవో సంస్థల ప్రతినిధుల హాజరుకాగా పట్టణానికి చెందిన ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం ప్రపంచ వాణిజ్య సంస్థలో భాగస్వామిగా ఉన్నది కాబట్టి ఇక్కడ తీసుకునే నిర్ణయాలు భారతదేశంలోని అనేక వర్గాల పై ప్రభావం చూపుతుంది ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలకు అనుకూలంగా WTO చట్టాలు ఉన్నాయి అభివృద్ధి చెందుతున్న దేశాల హక్కులు హరించబడుతున్నాయి ముఖ్యంగా వెనుకబడిన దేశాల ఉత్పత్తులు అనుమతించడం కోసం అభివృద్ధి చెందిన దేశాలు అనేక ఆంక్షలు పెట్టి ఎగుమతులను నియంత్రిస్తున్నాయి ఇంకొక వైపు అభివృద్ధి చెందిన దేశాల తమ తమ కార్పొరేట్ శక్తుల ద్వారా విపరీతమైన దిగుమతులు చేసుకొని భారత్ లాంటి దేశాలలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు కాకుండా చూస్తూ కంపెనీలు లాభాలు గడిపేస్తున్న నేపథ్యాలంలో భారత్ దేశ ప్రభుత్వం మన దేశ రైతులు కుబేర పరిశ్రమలు వీధి వ్యాపారుల రక్షణ కోసం గట్టిగా పోరాడాలని లేదా డబ్ల్యు టి ఓ నుండి బయటకి రావాలని కోటపాటి నరసింహనాయుడు అబుదాబి వేదికగా డిమాండ్ చేశారు. ఆహార రంగం ఉద్యోగాలు మందులపై ఉన్న ఆంక్షలు సడలించి స్థిరమైన అభివృద్ధిని కాంక్షించే విధంగా నిర్ణయాలు ఉండాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి చెందిన దేశాలు విధిస్తున్న ఆంక్షలు ముఖ్యంగా రైతులకు ఇచ్చే సబ్సిడీలు బంద్ చేయాలని దానివలన రైతులు వ్యవసాయం మానుకొని పరిస్థితి నెలకొందని సభ్యులకు కోటపాటి వివరించారు. వెనుకబడిన భారత్ నుండి లక్షలాది సంఖ్యలో గల్ఫ్ దేశాలలో అదేవిధంగా అభివృద్ధి చెందిన దేశాలలో ఉన్న ఇండియన్ వర్క్స్ హక్కులు పరిరక్షించబడాలని కోరారు కోటపాటితో పాటు కర్ణాటక నుంచి కురుగురు శాంత కుమార్ కేరళ నుండి K.V.బిజు లు సంయుక్త కిషన్ మోర్చా తరపున పాల్గొన్నారు.