కొత్తూరు మండలంలో భారీ వర్షపాతం నమోదు.

బంగాళాఖాతం దక్షిణ భాగంలో ఏర్పడిన అల్ప పీడనానికి అనుబంధంగా మరో అల్పపీడనం ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణ జిల్లాలలో– 16.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు.
– అప్రమత్తంగా ఉండాలంటున్నా అధికారులు
నవతెలంగాణ-కొత్తూరు
బంగాళాఖాతం దక్షిణ భాగంలో ఏర్పడిన అల్ప పీడనానికి అనుబంధంగా మరో అల్పపీడనం ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణ జిల్లాలలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మండల పరిధిలోని పలు గ్రామాలలో శనివారం ఉదయానికి 16.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములతో కూడిన వర్షాలతో పాటు బలమైన ఈదురుగా వీచే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 30 – 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి.
అప్రమత్తంగా ఉండాలి.
రెండు రోజులగా కురుస్తున్న భారీ వర్షాల నేపద్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న గృహాలలో ఉండరాదని, విద్యుత్ స్తంభాలను తాకకుండా విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మహిళలు బట్టలు ఐరన్ తీగలపై ఆరవేయకూడదని సూచిం

Spread the love