– అగ్రనేతల ఆశయ సాధనలో..
– ప్రతి యేట పీఎల్ జిఏ వారోత్సవాలు
– అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం
నవతెలంగాణ-మల్హర్ రావు : భారత విప్లవ ఉద్యమ చరిత్రలో కొయ్యూరు భారీ ఎకౌంటర్ మావోయిస్టు పార్టీకి తీరని నష్టం తెచ్చిపెట్టింది. శ్రీకాకుళ, నక్సల్ బరి రైతాంగ గేరిల్ల పోరాటంలో పదుల సంఖ్యలో జరిగిన నష్టాలను అధిగమించి , స్పెషల్ జోన్ కమిటీలను ఏర్పాటు చేసుకొని రెడ్ ఆర్మీ వైపు అడుగులు వేస్తున్న సమయంలో మావోయిస్టు పార్టీకి మూల స్తంభాలాంటి నల్ల ఆదిరెడ్డి, సంతోష్ రెడ్డి శీలం నరేష్ లాంటి ముఖ్య నాయకులు ఒకే చోట చిట్టి ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. డిసెంబర్ 2 విప్లవకార్లకు, విప్లవ సానుభూతిపరుల గుండెల్లో విషాదం రోజుగా మిగిలిపోయింది. మావోయిస్టు పార్టీ అవసరాల కోసం బెంగళూరులో ఉన్న ఆ ముగ్గురిని హెలికాప్టర్లో తరలించి మంథని కాటారం మధ్యలో ఉన్న కొయ్యూరు ఆడవులో చంపినట్లు పలు సందర్భాల్లో మావోయిస్టు పార్టీ నాయకులతో పాటు ప్రజా సంఘాలు తెలిపాయి. ఆ ముగ్గురి ఆమరత్వానికి గుర్తుగా మావోయిస్టు పార్టీ ప్రతిఏటా పీపుల్స్ గేరిల్ల ఆర్మీ వారోత్సవాలను నిర్వహిస్తుంది. అమరవీరుల ఆశయాలను ప్రజల మధ్యకు తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఈ వేడుకలను డిసెంబర్ 2 నుండి 9 వరకు వరుసగా జరుపుతున్నారు. 2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ పిలుపుమేరకు శాంతి చర్చలు జరిగాయి.
పల్లె గుండెల్లో తూటా గాయం…
మూడు దశాబ్దాల కిందట సమసమాజాన్ని స్థాపించే లక్ష్యంతో నక్స లైట్లు శాoతి భద్రతల పేరిట పోలీసుల మధ్య సాగిన సాయుధ పోరులో పల్లెలు సమీదలయ్యాయి.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆనాటి ఘటనలు చెరిగిపోని జ్ఞాపకాలను మిగిల్చాయి.మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గౌరీల్లా (పిఎల్జివో)వారోత్సవాలను ఇప్పుడు నిర్వహిస్తోంది.ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని కొయ్యుర్ అటవీప్రాంతంలో 1999 డిసెంబర్ 2న జరిగిన ఎన్ కౌoటర్ లో మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యులు,అగ్రనేతలు ఎన్కౌoటర్ అయ్యారు.ఈ ఎన్కౌoటర్ స్మరించుకుంటు పిఎల్ జిఏ వారోత్సవాలు మావోయిస్టు పార్టీ నిర్వహిస్తోంది.సరిగ్గా 24 ఏళ్ల కిందట జరిగిన ఈ ఎన్కౌoటర్ లో రాజన్న సిరిసిల్ల వీర్నపల్లి మండలం గర్జనపెళ్లికి చెందిన సింగం లక్ష్మీరాజాం పశువుల కాపరి (21) మరణించారు.అగ్రనేతలతో ఎన్కౌoటర్ అయిన లక్ష్మీ రాజాం పశువుల కాపరి మాత్రమే పల్లె గుoడెలపై నాటి తూటా కూడా గాయం ఇంకా పలుపుతొంది.ఓ పశువుల కాపరి మావోయిస్టు అగ్రనేతలతో ఎన్కౌoటర్ కావడం అప్పట్లో తివృ చర్చనీయాంశంగా మారింది.
శీలం నరేశ్ కు సిరిసిల్లతో అనుబంధం…
కొయ్యుర్ మృతుల్లో మరో అగ్రనేత శీలం నరేశ్ అలియాసిస్ మురళి జగిత్యాల వాసికాగ సిరిసిల్ల పాలిటెక్నిక్ కళాశాలలో (అగ్రహారంలో) చదువుతున్నాడు.ఆయన సోదరుడు సిరిసిల్ల సెస్ లో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాడు.సిరిసిల్లలో శీలం నరేశ్ మిత్రులు చాలామంది ఉన్నారు.కొయ్యుర్ ఎన్కౌoటర్ సిరిసిల్ల ప్రాతంలో కలకలం సృష్టించింది.ఆ ఎన్ కౌoటర్ లో అగ్రనేతలు ముగ్గురు మరణించగా రాజన్న సిరిసిల్లకు చెందిన పశువుల కాపరి లక్ష్మీరాజాం మరణించడం చర్చకు దారి తీసింది.