కేపీఆర్ స్పెషల్ సాంగ్ ఆల్బమ్ ప్రారంభం..

నవతెలంగాణ – దుబ్బాక రూరల్
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పద్మనాభునిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, తెలంగాణ ఉద్యమకారుడు ముక్కపల్లి శ్రీనివాస్ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై చేసిన కేపీఆర్ స్పెషల్ సాంగ్ ఆల్బమ్ ను బుధవారం దుబ్బాక మండల కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ నాయకులు, మండల ప్రజా ప్రతినిధులతో కలిసి మెదక్ ఎంపీ ప్రారంభించారు. అనంతరం అల్బయ్ సంబంధించిన “ఊరూ కదిలింది లల్లాయిరే” ఆడియో సాంగ్ ని ఎంపీ విని…ముక్కపల్లి శ్రీనివాస్ ని (రచయిత ) అభినందించాడు. ఆల్బమ్ ఆవిష్కరణలో బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గుండెల్లి ఎల్లారెడ్డి,బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాణాల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు పల్లె వంశీ కృష్ణ గౌడ్, కౌన్సిలర్లు ఆశ స్వామి ఇల్లందుల శ్రీనివాస్ ఆశ యాదగిరి పల్లె రామస్వామి గౌడ్, టిఆర్ఎస్ నాయకులు గన్నే భూమ్ రెడ్డి, నారా గౌడ్, రాజిరెడ్డి, పలువురు సర్పంచులున్నారు.

Spread the love