సాహసానికి, ప్రయోగాలకు మారు పేరు కృష్ణ

నవతెలంగాణ-కల్చరల్‌
సినీ రంగం లోనూ నిజ జీవితం లోను సాహాసాలకు ప్రయోగాలకు మారు పేరు కృష్ణ అని రాష్ట్ర బి.సి.కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ వకుళా భరణం కృష్ణ మోహన్‌ రావు అన్నారు. కళానిలయం ప్రముఖ సాంస్కృతిక సంస్థ నిర్వహణ లో సినీ హీరో కృష్ణ 80 వ జయంతి వేడుకలు కృష్ణ అభిమాన సందోహం సందడి మధ్య శ్రీత్యాగరాయ గాన సభ లో జరిగాయి. ముఖ్య అతిథిగా డాక్టర్‌ వకుళా భరణం కృష్ణమోహన్‌ రావు పాల్గొని మాట్లాడుతూ గూఢచారి కౌబారు వంటి సినిమాలు తెలుగులో రావటానికి కారణం కృష్ణ అన్నారు. ఆయన సాహసవంతంగా తీసి నటించిన అల్లూరి సీతారామరాజు నాటికీ నేటికి ఏనా టికి సినీ చరిత్రలో శాశ్వతంగా నిలిచి వుంటుందన్నారు. సంఖ్యా శాస్త్ర వేత్త డైవజ్ఞ శర్మ అధ్యక్షత వహించిన సభలో కృష్ణ వ్యక్తి గత మేకప్‌ కళా కారుడు మాధవరావు, కృష్ట తో సినిమాలు నిర్మించిన శివనాగ్‌, బద్రి నాధ్‌లను సత్కరించారు. పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మెన్‌ శ్రీనివాస్‌ గుప్త, దిద్ది రాంబాబు,సురేష్‌ గౌడ్‌ బాబ్జి తదితరులు పాల్గొ న్నారు. సురేందర్‌ స్వాగతం పలికిన సభలో తొలుత సాయి శ్రీ, మహేష్‌ విజరు శిష్యుల నాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. పుష్ప లత వందన సమర్పణ చేశారు.

Spread the love