పారిశుద్ధ్య కార్మికుల‌తో నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌లు జరుపుకున్న కేటీఆర్

నవతెలంగాణ -హైద‌రాబాద్ : నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌ను బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పారిశుద్ధ్య కార్మికుల‌తో క‌లిసి జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ పారిశుద్ధ్య కార్మికుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. వారితో కాసేపు ముచ్చ‌టించిన కేటీఆర్.. అనంత‌రం క‌లిసి భోజ‌నం చేశారు. కార్మికుల‌తో సెల్ఫీలు దిగారు. ఈ కార్య‌క్ర‌మంలో జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి పాల్గొన్నారు. ఇక కేటీఆర్‌ను ప‌లువురు బీఆర్ఎస్ ప్రజాప్ర‌తినిధులు, నేత‌లు, కార్య‌క‌ర్త‌లు క‌లిసి నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు.

Spread the love