నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమృత్ పథకంలో అక్రమాలకు పాల్పడిందని ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ ఆయన బావమరిది సృజన్‌కు లాభం చేకూరేలా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ కేటీఆర్ గతంలోనే ఖట్టర్‌కు లేఖ రాశారు. ఇప్పుడు నేరుగా కలిసి ఫిర్యాదు చేశారు.