నవతెలంగాణ – హైదరాబాద్: రాఖీపౌర్ణమి పండుగ సందర్భంగా తన సోదరి కవితను గుర్తు చేసుకుని మాజీ మంత్రి కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ‘నువ్వు ఇవాళ రాఖీ కట్టకపోయినా నీ కష్టసుఖాల్లో నేను తోడుగా ఉంటాను’ అని ట్వీట్ చేశారు. గతంలో కవిత రాఖీ కట్టినప్పటి, ఆమె జైలుకు వెళ్తున్నప్పటి ఫొటోలను షేర్ చేశారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను ఈ ఏడాది మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె తిహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.